Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మన అందరివాడు మెగాస్టార్ చిరంజీవి' : రోజా బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలు అయితే, చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇల

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (12:06 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలు అయితే, చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి వారిలో సినీనటి, ఎమ్మెల్యే రోజా ఒకరు. ఆమె చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. 'మన అందరివాడు మెగాస్టార్ చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఫొటోలను షేర్ చేశారు.
 
కాగా, మెగాస్టార్‌ చిరంజీవి బుధవారం 63వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి చిరుకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరు పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. గంటలోనే 11 లక్షల మంది టీజర్‌ను వీక్షించినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
 
చిరంజీవికి సెలెబ్రిటీలు చేసిన బర్త్‌డే ట్వీట్స్.. 
నాగార్జున: డియర్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
వెంకటేశ్‌: నా స్నేహితుడు చిరంజీవికి హ్యాపీ బర్త్‌డే.
శ్రీను వైట్ల: మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలి సర్‌.
వంశీ పైడిపల్లి: మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం. 
శ్రీకాంత్‌: మీకెంతో ప్రత్యేకమైన ఈరోజు సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా.
రాధిక: నా ప్రియమైన మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు రాక్‌స్టార్‌. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
కొరటాల శివ: మా మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్‌ చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. 
హరీశ్‌ శంకర్‌: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌. చిత్రపరిశ్రమకు మీరు అందిస్తున్న మంచి సినిమాలకు, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకూ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నందుకు గానూ ధన్యవాదాలు. లవ్యూ సర్‌.
 
అల్లు అర్జున్‌: మా ఏకైక మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
సాయి ధరమ్‌ తేజ్‌: మీరు మాకు పంచిన స్ఫూర్తి, ప్రేమ ఎంతో పవిత్రమైనది. లవ్యూ మామా.. హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌.
వరుణ్‌ తేజ్‌: నా స్ఫూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
అనుపమ పరమేశ్వరన్‌: నిజమైన స్ఫూర్తి.
లావణ్య త్రిపాఠి: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌ చిరంజీవి గారు. ‘సైరా’లో మీ లుక్‌ సూపర్‌. 
ఈషా రెబ్బా: మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. 
మెహర్‌ రమేశ్‌: లక్షలాది మందికి ఎంతో స్ఫూర్తిదాయకమైన మెగాస్టార్‌ చిరంజీవి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అనిల్‌ రావిపూడి: పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు.
మెహరీన్‌: మాకెంతో స్ఫూర్తిదాయకమైన చిరు సర్‌కు హ్యాపీ బర్త్‌డే. 
కల్యాణి ప్రియదర్శన్‌: మన మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీ మాటలు నాకెంతో స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు సర్‌. 
సుధీర్‌బాబు: మెగాస్టార్‌ వయసు సంవత్సరం తగ్గింది. మా యంగ్‌ బ్రదర్‌ మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
గీతా ఆర్ట్స్ : విషింగ్ అవర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. వెరీ హ్యాపీ బర్త్‌డే. 
ప్రదీప్ మాచిరాజు : హ్యాపీ బర్త్‌డే మా ముఠామేస్త్రీ, మా గ్యాంగ్‌లీడర్... ది బాస్. 
వైజయంతీ మూవీస్ : మా ఏకైక మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments