Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానితో త‌న పేరును `ఇంకోసారి ఇంకోసారి`పిలిపించుకున్న రీతూవ‌ర్మ‌

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:01 IST)
Nani, Ritu varma, song
`ఏంటీ గుమ‌` అని నాని పిల‌వ‌గానే. అదేమిట! .అంటూంది రీతూవ‌ర్మ‌. గుమ్మ‌డి వ‌ర‌ల‌క్ష్మి.. అందుకే `గుమ` అన్నానంటాడు.. అది న‌చ్చి.. ఇంకోసారి ఇంకోసారి అంటూ డ్యూమెట్ వేసుకుంటుంది. ఈ పాట లిరిక‌ల్ వీడియో సాంగ్ శ‌నివారంనాడు విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. నాని 26వ చిత్రంగా 'ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందుతోంది. ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి వారు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
 
ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లే చిత్ర బృందం శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు "ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎద‌లో చేరి" అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ విన్న‌కొద్దీ వినాల‌నిపించే మ‌ధుర‌మైన బాణీలు అందించిన ఈ పాట‌కు చ‌క్క‌ని ప‌ద‌బంధాల‌తో సాహిత్యం అందించారు చైత‌న్య ప్ర‌సాద్‌. శ్రేయా ఘోష‌ల్‌, కాల‌భైర‌వ గానం ఈ సాంగ్‌కు మ‌రింత రిచ్‌నెస్ తీసుకొచ్చింది. చిత్రంలో ఈ పాట‌ను నాని, రీతూ వ‌ర్మ‌పై చిత్రీక‌రించారు. వారిద్ద‌రి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.
 
ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments