Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకెంత ధైర్యం.. నన్ను బజారు కీడుస్తావా? రిచా చద్దా ఫైర్ (Video)

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:35 IST)
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు లైంగిక సంబంధం ఉందంటూ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఇటీవల వ్యాఖ్యలానించి సంచలనం రేపింది. దీనిపై రిచా చద్దా ఓ స్పందించారు. ఇందులో తన పేరును ప్రస్తావించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. 
 
ఇటీవల సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సినీ నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, సినీనటి రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు తనతో లైంగిక సంబంధాలున్నాయని అనురాగ్ గతంలో తనకు చెప్పినట్టు పాయల్ వెల్లడించింది. 
 
ఈ వ్యాఖ్యలపై రిచా చద్దా మండిపడింది. తన పేరును ప్రస్తావించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ఆమె తరపు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ అనవసరంగా తన క్లయింట్‌ రిచా పేరును ప్రస్తావించారని, అవమానకర రీతిలో ఆమె పేరును వాడారని పేర్కొన్నారు. 
 
ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. అనవసర వివాదంలోకి రిచా పేరును లాగి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బ‌తీశారన్నారు. ఇతర మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు సరికావని, ఆ హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ విషయంపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. ఇది అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడుని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. వీరు విచారణలో వెల్లడించిన బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు జారీచేసే పనిలో ఎన్.సి.బి అధికారులు ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం