బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేశారు. తనపై అనురాగ్ బలవంతం చేయబోయాడనీ, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ క్రమంలో అనురాగ్‌కు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు అండగా ఉంటున్నారు. ఈ కోవలో ఆయన మాజీ భార్య కల్కి కొచ్లిన్ కూడా మద్దతు ప్రకటించింది. ఇదే అంశంపై ఆమె డియర్ అనురాగ్ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ రాశారు.
'ప్రియమైన అనురాగ్ మీపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోకండి. వ్యక్తిగతంగా మీరు మహిళలను ఎంత సమర్ధిస్తారనే దానికి నేనే ప్రత్యక్షసాక్షిని. మహిళల స్వేచ్చను కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగానే కాదు, వృత్తిపరంగానూ నాకెంతో అండగా నిలబడ్డారు. మన విడాకుల తర్వాత చిత్తశుద్ధితో నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్‌లో అసౌకర్యానికి లోనైనప్పుడు నాకెంతో మద్దునిచ్చారు.
నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది మన స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అవరసరమైన సమయంలో ప్రేమను పంచే వ్యక్తులేకాకుండా దయచూపే వ్యక్తులు కూడా ఉంటారు. మీరు గౌరవానికి కట్టుబడి ధైర్యంగా ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి' అంటూ కల్కి కొచ్లిన్ పేర్కొన్నారు.