Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలమైన ఆధారాలు ఉన్నాయ్.. బెయిల్ రద్దు చేయండి : ఎన్సీబీ

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (08:44 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం వెలుగు చూసింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. 
 
అయితే, ఈ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి కొన్ని నెలల పాటు జైలు జీవితాన్ని గడిపింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిలు మంజూరు చేసింది. అలాగే, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది.
 
ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో రియాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయనీ, అందువల్ల ఆమె బెయిల్‌ను రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి (18న) విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments