గతేడాది జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. లాక్‌డౌన్ సమయంలో అతడి మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. మొదట్లో డిప్రెషన్‌తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తరువాత చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మరోవైపు తమ కుమారుడి డబ్బును రియా, ఆమె కుటుంబం వాడుకుందని సుశాంత్ కుటుంబం కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ అభిమానులు సహా పలువురు డిమాండ్ చేయడంతో సీబీఐ కూడా ఈ కేసులో భాగం అయ్యింది.
ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడగ్గా.. ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, బాలీవుడ్ నటీనటులు అర్జున్ రాంపాల్, దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురిని విచారించారు. వీరిలో 33 మందిపై ఆరోపణలు రాగా.. వారిని అరెస్ట్ చేసి విచారించారు. అందులో ఎనిమిది మంది ఇప్పటికీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఛార్జీషీట్ సిద్ధం చేశారు పోలీసులు. రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు పలువురిని విచారించారు. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్‌ని ప్రిపేర్ చేశారు అధికారులు. 12వేల పేజీలతో ఈ ఛార్జ్‌షీట్ ఉండగా.. ఇందులో సంబంధం ఉన్నట్లు మొత్తం 33 మంది పేర్లను పొందపరిచినట్లు తెలుస్తోంది.