రియా నా కుమారుడిని చంపిన హంతకురాలు.. సుశాంత్ తండ్రి

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (14:01 IST)
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని నటుడు సశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల పాటు రియా తన బిడ్డకు విషం ఇచ్చిందని.. ఆమే హంతకురాలని ఆరోపించారు. ఆమెను, ఆమె అనుచరులను దర్యాప్తు సంస్థలు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
 
రియాను అరెస్టు చేయాలంటూ ఇప్పటికే సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ వరస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. 'ప్రధాన నిందితురాలు ఆమె బహిరంగంగా తిరుగుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఆమెను అరెస్టు చేయాలి' అని కోరారు.
 
అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తాజాగా తన సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని వుందని.. రక్షణ కల్పించాలని ముంబై పోలీసులని కోరింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన రియా.. అందులో కనిపిస్తున్న వ్యక్తి తన తండ్రి  ఇంద్రజిత్ చక్రవర్తి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. 
 
తాము ఈడీ, సీబీఐ దర్యాప్తులో భాగంగా మా ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, ఇలా కొంతమంది ఇంటి ముందు గుమికూడి ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సమాచారం ఇచ్చినా.. స్పందన లేదని చెప్పింది. కోవిడ్ కాలంలో శాంతి భద్రతలని అందించాల్సిన అవసరం ఎంతైన ఉందని రియా తన పోస్ట్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments