Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యే హమారా ఇజ్జత్‌ కా సవాల్‌ హై' : పీకే ఫ్యాన్స్‌కు ఆర్జీవీ బస్తీమే సవాల్

Webdunia
సోమవారం, 20 జులై 2020 (12:39 IST)
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మల మధ్య మాటలయుద్ధం మొదలైంది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని "పవర్ స్టార్" పేరుతో ఓ చిత్రాన్ని ఆర్జీవి నిర్మిస్తున్నారు. ఇందులో అచ్చం పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌లను పోలిన డూప్ నటీనటులను ఎంపిక చేశారు. పైగా, ఈ చిత్రంలోని 'గ‌డ్డి తింటావా?' అనే పాటను నిన్న సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఆయన విడుద‌ల చేశారు. దీనిపై పవన్ కల్యాణ్‌ వీరాభిమాను మండిపడుతున్నారు.
 
యూట్యూబ్‌లో ఈ పాటకు డిస్‌లైక్‌లు కొడుతూ, వర్మను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'పవర్ స్టార్‌ సాంగ్‌కు 5 గంటల్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ, కేవలం 20 వేల డిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. ఒక పీకే ఫ్యాన్‌గా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కేవలం 20 వేల డిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. పీకేకు ఇంత తక్కువగా ఫ్యాన్స్‌ ఉన్నారా?' అని ఆయన ట్వీట్లు చేశారు.
 
అంతేకాకుండా, పవర్ స్టార్‌ను రక్షించడానికి తాను రెడీగా ఉన్నానంటూ కొడవలి పట్టుకుని, లుంగీ కట్టుకుని ఉన్న తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. 'హే పీకే ఫ్యాన్స్.. మీరు మరింత చురుకుగా ఉండాలి.. మరిన్ని డిస్‌లైక్స్‌ కొట్టాలి. యే హమారా ఇజ్జత్‌ కా సవాల్‌ హై' అని ఆయన చురకలంటించారు. అలాగే, ఈ నెల 22న విడుదల కానున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్‌ను చాలా మంది కొనుక్కుని చూడనున్నారని వర్మ అన్నారు. 
 
అది ఓ పరాన్నాజీవి... దీనిముద్దుపేరే ఆర్జీవీ : పవన్ వీరాభిమాని 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల ఆర్జీవ ఓ అడుగు ముందుకేసి పవర్ స్టార్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై పీకే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'నా స్వేచ్ఛ నా ఇష్టం' అని వర్మ ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు చేస్తున్నాడు. ట్విట్ట‌ర్ ఉంది క‌దా.. అని ఏది ప‌డితే అది రాసేసి, ఎంత ప‌డితే అంత, ఎవ‌రిపై ప‌డితే వాళ్ల‌పై.. వర్మ వాడే పద ప్రయోగం దారుణం అని ఆయ‌న అభిమానులు అన‌బ‌డే భ‌క్తులు కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న విషయం. 
 
ఆత్మ క‌థ‌లు, ఆత్మ‌ల క‌థ‌లు తీసి, సొమ్ము చేసుకోవాల‌నుకోవ‌డం వ‌ర్మ వ్యాపార సూత్రం. అలాంటి వ‌ర్మ మ‌రోసారి తనకే సొంతమైన తెలివి తేట‌లు ఉప‌యోగిస్తూ 'ప‌వ‌ర్ స్టార్'’ సినిమా తీస్తున్నాడు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కాదు అని చెబుతూనే ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఫొటోలు, పోస్టర్స్ వదులుతున్నాడు. ఎప్ప‌టిలా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు త‌క్కువ - డూప్‌ల‌కు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెద‌కి ప‌ట్టి కేవ‌లం ప‌బ్లిసిటీతో జిమ్మిక్కుల చేసి, టికెట్లు అమ్ముకోవ‌డానికి వెంప‌ర్లాడిపోతున్నాడు వర్మ. 
 
కానీ పవన్ కల్యాణ్ సైడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఆయన వదిలేసినా.. ఈసారి మాత్రం పవన్ అభిమానులు వర్మని వదిలేలా కనిపించడం లేదు. మాములుగా అయితే ఇప్పటివరకు అంద‌రినీ వ‌ర్మ కెల‌క‌డం త‌ప్ప.. వ‌ర్మ జోలికి పోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేదు. కానీ.. అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు క‌దా..? వ‌ర్మ‌ని కాల‌ర్ ప‌ట్టుకుని, నెత్తిమీద రెండు మొట్టికాయ‌లు వేసే వాడు ఎవ‌డో ఒక‌డు, ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తాడు. 
 
ఈసారి వ‌చ్చేశాడు కూడా. అంద‌రిపై సినిమాలు తీసే వ‌ర్మ‌పై ఓ సినిమా తీస్తున్నారిప్పుడు. పేరేంటో తెలుసా? "ప‌రాన్న జీవి". ఎప్పుడూ పక్కోడిపై ప‌డిపోయి, బ‌తికేసే ఆర్జీవికి.. భ‌లే సూటైపోయిన పేరు క‌దా..? తమ అభిమాన నటుడిపై సెటైరికల్‌గా వర్మ సినిమా తీస్తుంటే.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డం నిజంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీనే అనాలి. త్వరలోనే ఈ 'ప‌రాన్న‌జీవి'కి సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ విడుదల చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ను రిలీజ్ చేయగా, ఆర్జీవీని కూడా టార్గెట్ చేస్తూ ఓ కవితను కూడా రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటో ఓ లుక్కేయండి. 
 
"ఇది ఒకే ఒక అరుదైనజీవి
కన్నీళ్ళపై కాసులేరుకునే కక్కుర్తిజీవి
వ్యవస్థను అపహాస్యం చేసే వింతజీవి
వెర్రి ఆలోచనలతో విసిగించే వికృతజీవి
అమ్మాయిల ఆశలతో ఆడుకునే అర్బకజీవి
కనికరంలేకుండా కాల్చుకుతినే కర్కశజీవి
ఇదేఇదే పరాన్నజీవి దీనిముద్దుపేరే ఆర్జీవి". 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments