Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీళ్లపై కాసులేరుకునే కక్కుర్తిజీవి.. దీనిముద్దుపేరే ఆర్జీవీ : పవన్ వీరాభిమాని

Advertiesment
కన్నీళ్లపై కాసులేరుకునే కక్కుర్తిజీవి.. దీనిముద్దుపేరే ఆర్జీవీ : పవన్ వీరాభిమాని
, సోమవారం, 20 జులై 2020 (09:51 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల ఆర్జీవ ఓ అడుగు ముందుకేసి పవర్ స్టార్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం అచ్చం పవన్ కళ్యాణ్‌ను పోలిన హీరోను, పవన్ మాజీ భార్య, ప్రస్తుత భార్యను పోలిన అమ్మాయిలను ఎంపిక చేసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఇప్పటి వరకు సినీ చరిత్రలో లేనిది.. ఈ చిత్ర ట్రైలర్ చూడడానికి కూడా డబ్బులు పే చేయాలని వర్మ కొత్త రూల్‌ని పెట్టాడు. ఇందుకోసం రూ.25 టిక్కెట్ ధరను నిర్ణయించాడు. 'నా స్వేచ్ఛ నా ఇష్టం' అని వర్మ ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు చేస్తున్నాడు. ట్విట్ట‌ర్ ఉంది క‌దా.. అని ఏది ప‌డితే అది రాసేసి, ఎంత ప‌డితే అంత, ఎవ‌రిపై ప‌డితే వాళ్ల‌పై.. వర్మ వాడే పద ప్రయోగం దారుణం అని ఆయ‌న అభిమానులు అన‌బ‌డే భ‌క్తులు కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న విషయం. 
 
ఆత్మ క‌థ‌లు, ఆత్మ‌ల క‌థ‌లు తీసి, సొమ్ము చేసుకోవాల‌నుకోవ‌డం వ‌ర్మ వ్యాపార సూత్రం. అలాంటి వ‌ర్మ మ‌రోసారి తనకే సొంతమైన తెలివి తేట‌లు ఉప‌యోగిస్తూ 'ప‌వ‌ర్ స్టార్'’ సినిమా తీస్తున్నాడు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కాదు అని చెబుతూనే ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఫొటోలు, పోస్టర్స్ వదులుతున్నాడు. ఎప్ప‌టిలా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు త‌క్కువ - డూప్‌ల‌కు ఎక్కువ అనిపించే ఆర్టిస్టుల్ని వెద‌కి ప‌ట్టి కేవ‌లం ప‌బ్లిసిటీతో జిమ్మిక్కుల చేసి, టికెట్లు అమ్ముకోవ‌డానికి వెంప‌ర్లాడిపోతున్నాడు వర్మ. 
 
కానీ పవన్ కల్యాణ్ సైడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ రాలేదు. ఆయన వదిలేసినా.. ఈసారి మాత్రం పవన్ అభిమానులు వర్మని వదిలేలా కనిపించడం లేదు. మాములుగా అయితే ఇప్పటివరకు అంద‌రినీ వ‌ర్మ కెల‌క‌డం త‌ప్ప.. వ‌ర్మ జోలికి పోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేదు. కానీ.. అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు క‌దా..? వ‌ర్మ‌ని కాల‌ర్ ప‌ట్టుకుని, నెత్తిమీద రెండు మొట్టికాయ‌లు వేసే వాడు ఎవ‌డో ఒక‌డు, ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తాడు. 
 
ఈసారి వ‌చ్చేశాడు కూడా. అంద‌రిపై సినిమాలు తీసే వ‌ర్మ‌పై ఓ సినిమా తీస్తున్నారిప్పుడు. పేరేంటో తెలుసా? "ప‌రాన్న జీవి". ఎప్పుడూ పక్కోడిపై ప‌డిపోయి, బ‌తికేసే ఆర్జీవికి.. భ‌లే సూటైపోయిన పేరు క‌దా..? తమ అభిమాన నటుడిపై సెటైరికల్‌గా వర్మ సినిమా తీస్తుంటే.. వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమాని ఓ సినిమా తీయ‌డం నిజంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీనే అనాలి. త్వరలోనే ఈ 'ప‌రాన్న‌జీవి'కి సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ విడుదల చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ను రిలీజ్ చేయగా, ఆర్జీవీని కూడా టార్గెట్ చేస్తూ ఓ కవితను కూడా రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటో ఓ లుక్కేయండి. 
 
"ఇది ఒకే ఒక అరుదైనజీవి
కన్నీళ్ళపై కాసులేరుకునే కక్కుర్తిజీవి
వ్యవస్థను అపహాస్యం చేసే వింతజీవి
వెర్రి ఆలోచనలతో విసిగించే వికృతజీవి
అమ్మాయిల ఆశలతో ఆడుకునే అర్బకజీవి
కనికరంలేకుండా కాల్చుకుతినే కర్కశజీవి
ఇదేఇదే పరాన్నజీవి దీనిముద్దుపేరే ఆర్జీవి"
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీతులు చెప్పే హీరోలంతా.. హీరోయిన్లు పక్కలోకి రాలేదని అలా చేసినవారే... రిచా చద్దా