Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ పడుద్ది : 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు లైన్ క్లియర్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:00 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన.. ఈసీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019, మార్చి 29వ తేదీ సినిమా విడుదల ఉంటుందని తెలిపారు. మూవీ రిలీజ్ తర్వాత అభ్యంతరాలు ఉంటే.. మళ్లీ వివరణ ఇస్తామన్నారు. జగన్‌తో బంధుత్వం లేదని.. కేవలం పార్టీ అధినేతగా మాత్రమే పరిచయం అని స్పష్టం చేశారాయన. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రాసిన పుస్తకం ఆధారంగా సినిమా నిర్మించడం జరిగిందని ప్రకటించారు. 
 
పోలింగ్‌కు 13 రోజుల ముందు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కావటంపై టీడీపీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబును విలన్‌గా చూపించారంటూ.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సినిమా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అభిమానులు. దీంతో నిర్మాత రాకేష్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం లైన్ క్లియర్ కావడంతో మార్చి 29వ తేదీన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments