Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ మహేష్... నీతో ఓ సెల్ఫీ: ప్రిన్స్ మహేష్ బాబు (ఫోటోలు)

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:49 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మను హైదరాబాదులోని ఆయన సొంత థియేటర్లో ఆవిష్కృతం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ వచ్చారు. మహేష్ బాబు, తన మైనపు బొమ్మ ప్రక్కన నిలబడి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇపుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
కాగా దక్షిణ భారతదేశానికి చెందిన ఒక హీరో మైనపు బొమ్మను టుస్సాడ్‌లో ప్రతిష్టించడం ఇదే తొలిసారి. ఈ తరహా ఘనతను సాధించిన తొలి హీరో కూడా ఆయనే. అయితే ఈ మైనపు బొమ్మను చూసేందుకు ప్రతి ఒక్కరూ అక్కడకు వెళ్లడం సాధ్యపడదు. అందుకే ఆ తరహా విగ్రహాన్ని హైదరాబాదుకు తీసుకువచ్చారు. పైగా మహేష్ బాబు మహర్షి బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన సింగపూర్ వెళ్లేందుకు సాధ్యపడలేదు. దానితో హైదరాబాద్ నగరంలోని గచ్చీబౌలిలో మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌కి తీసుకువచ్చారు. 
 
అభిమానులు వచ్చి సూపర్ స్టార్ విగ్రహంతో ఫొటో దిగొచ్చు. తర్వాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. ఇందులో మ‌హేష్ హెయిర్‌స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంది. 
 
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. అయన త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్రం టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments