Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు క‌బురు చ‌ల్ల‌గా నుంచి విడుద‌లైన ఫిక్స్ అయిపో...‌ పాట‌కు అనూహ్య స్పంద‌న‌

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (19:39 IST)
Fix Aipo song
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్నచిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఇటీవ‌లే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ యూట్యూబ్లో 75 ల‌క్ష‌లకి పైగా వ్యూస్ తెచ్చుకోవ‌డం విశేషం. ఇక మార్చి 9న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున ముఖ్య అతిధిగా జ‌రిగిన చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన హైలెట్స్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా అంత‌టా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి ఫిక్స్ అయిపో అనే క్యాచీ నెంబ‌ర్ ని విడుద‌ల చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన ఈ పాటను ప్ర‌ముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ పాడారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా వచ్చింది అని తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments