Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోగ్గాడి సరసన ''బంగార్రాజు"లో భూమిక?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (19:34 IST)
అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన బాక్సాపీస్ వద్ద మంచిటాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 
 
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ వస్తుందని నాగార్జున రీసెంట్‌‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలోని బంగార్రాజు పాత్రకు కొనసాగింపుగా ఈ సినిమా రానుంది. 
 
నటీనటుల్ని ఖరారు చేయటంలో చిత్రబృందం బిజీగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సీనియర్ నటీ భూమిక కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో బంగార్రాజు సరసన నటిస్తుందో లేకుంటే విలన్ రోల్‌లో కనిపిస్తుందో అనేది సస్పెన్స్. 
 
నాగార్జునతో 20 ఏళ్ళ క్రితం స్నేహమంటే ఇదేరా సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు బంగార్రాజు సినిమాలో నెగిటివ్ పాత్రలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలుకానుంది. ఇక నాగార్జున నటించిన' వైల్డ్ డాగ్' ఏప్రిల్ 2న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments