Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

ఐవీఆర్
శుక్రవారం, 28 జూన్ 2024 (19:08 IST)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి కొన్ని కారణాల వల్ల రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి ఆమె తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని పుణెలో స్థిరపడ్డారు. ఐతే ఇటీవలి ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయనకు విషెస్ చెప్పారు రేణు. అలాగే పవన్ తన వెంట అకీరా-ఆద్యలను ఢిల్లీకి తీసుకుని వెళ్లి ప్రధానమంత్రికి పరిచయం చేసారు. దీనిపై రేణూ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తన పిల్లలిద్దరూ ప్రధానమంత్రిని కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో తృప్తిగా వున్నదని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఇక అక్కడ్నుంచి ఆమెకి సోషల్ మీడియాలో టార్చర్ మొదలైంది.
 
పవన్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న కొందరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనవసరంగా పవన్ కల్యాణ్ అన్నయ్యను వదిలేసి తప్పు చేసారంటూ ఒకరు కామెంట్ చేస్తే.... అకీరా ముఖం హీరో అయ్యే ముఖమేనా అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా కామెంట్ల పరంపర సాగింది. ఈ కామెంట్లపై రేణూ దేశాయ్ సీరియస్ అయ్యారు. ట్రోల్ చేసినవారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కానీ రోజువారీ ఇలాంటివారి బెడదను తట్టుకోలేక ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
 
కేవలం ఇన్‌స్టాగ్రాం మాత్రం కొనసాగిస్తాననీ, అదికూడా జంతువుల సంరక్షణ కోసం మాత్రమేనంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. రేణూ దేశాయ్‌ను ఇలా ట్రోల్ చేస్తున్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నది పవన్ ఫ్యాన్స్ కాదని అంటున్నారు. ఎవరో పవన్ కల్యాణ్ కి కిట్టనివారు పనిగట్టుకుని ఈవిధమైన కామెంట్లు పెడుతూ రేణూని మానసికంగా టార్చర్ పెడుతున్నారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments