కాబోయే భర్తను ఎపుడెపుడు కలుస్తారు : రేణుకు ఫ్యాన్ ప్రశ్న

Webdunia
బుధవారం, 1 మే 2019 (12:05 IST)
కాబోయే భర్తను ఎపుడెపుడూ కలుస్తారు అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు ఓ అభిమాని ప్రశ్న సంధించాడు. దీనికి ఆమె సమాధానం చెప్పలేదు కదా... ఇలా అడగడం సరైన సంస్కారం కాదంటూ హెచ్చరించింది. 
 
తాజాగా ఆమె సోషల్ మీడియాలో వైల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెను పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి ఆమె చాలా ఓపిగ్గా సమాధానం చెప్పింది. కానీ, ఇద్దరు కొంటె అభిమానులు ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు సంధించారు. 
 
ఎవరూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను అడగవద్దని క్లాస్ పీకారు. కాబోయే భర్త పేరు చెప్పాలని ఓ అభిమాని కోరగా, అతని పేరును తాను చెప్పలేనని, పెళ్లి అయిన తర్వాత అతని వివరాలు తెలుస్తాయన్నారు. తాను ఈ లైవ్ వీడియోలో అతన్ని బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టలేనని, అతనికి కూడా కొంత ప్రైవసీ ఉండాలన్నారు. 
 
అతను సినీ, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తి కాదని, ఓ ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పారు. ఇక మరో ఫ్యాన్ ఇంకో అడుగు ముందుకేసి, కాబోయే భర్తను ఎప్పుడెప్పుడు కలుస్తారు? అని ప్రశ్నించగా, ఇలా అడగటం బ్యాడ్ మేనర్స్ అని హితవు పలికారు. ఇది మంచి సంస్కారం కాదని, వేరేవాళ్ల పర్సనల్ విషయాలు అడగకూడదని అన్నారు. ఇలా అడిగితే, తాను సమాధానాలు ఎలా చెప్పగలనని, ఏ సెలబ్రిటీలయినా, వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments