Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులకు అండగా నిలిచిన పవన్ మాజీ భార్య

Webdunia
బుధవారం, 12 మే 2021 (10:34 IST)
దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రెండో దశ వ్యాప్తితో ప్రజలంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లినా ప్రాణాలు నిలుస్తాయన్న నమ్మకం లేదు. చాలా మంది ఆక్సిజ‌న్ దొర‌క్క లేదంటే స‌రైన స‌మ‌యంలో చికిత్స అంద‌క క‌న్నుమూస్తున్నారు.
 
ఈ ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ని గ‌మనిస్తున్న కొంద‌రు సినీ సెల‌బ్రిటీస్ త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి, ద‌ర్శ‌కురాలు రేణూ దేశాయ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అవ‌స‌ర‌మైన వారికి త‌న వంతు సాయం చేస్తాన‌ని పేర్కొంది.
 
సోష‌ల్ మీడియాను సినిమా ప్ర‌మోష‌న్స్‌కు వాడుకునే వారు కూడా ఇప్పుడు కోవిడ్ స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డం సంతోషంగా ఉంది. నా ఇన్‌స్ట‌గ్రామ్ మేసేజ్ ఇన్‌బాక్స్ ఓపెన్‌లో ఉంటుంది. 
 
ప్లాస్మా, ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. ఇలా ఏదైన అవ‌స‌రం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నా వంతు సాయం చేస్తాను. గ‌త ప‌రిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయం మాత్రం చేయ‌లేను అని రేణూ వ్యాఖ్యానించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments