Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో వున్నానంటున్న రేణు దేశాయ్..

Advertiesment
ప్రేమలో వున్నానంటున్న రేణు దేశాయ్..
, మంగళవారం, 26 జనవరి 2021 (09:32 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య ప్రస్తుతం ప్రేమలో వుందట. ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత పూణేలో ఉంటున్న రేణూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. 
 
ఆ మధ్య తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు చిన్న హింట్ ఇచ్చింది రేణూ. దీంతో పవన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. అతనిని చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారు. ఈ పరిణామాలపై రేణూ ఫుల్ ఫైర్ అయింది.
 
కొద్ది నెలల క్రితం తనకు ఎంగేజ్‌మెంట్ కూడా అయిందని చెప్పుకొచ్చిన రేణూ మళ్ళీ ఆ టాపిక్ లేవనెత్తడం లేదు. అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రేణూ దేశాయ్ తాను అఫీషియల్‌గా ప్రేమలో పడినట్టు చెప్పుకొచ్చింది. 
 
ఇంతకు రేణూ ఎవరు ప్రేమలో పడింది అంటే ఫ్లూటో అనే ఓ కుక్క పిల్లతో. తాను ఆ కుక్కపిల్లతో అధికారికంగా ప్రేమలో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జంతు ప్రేమికురాలయిన రేణూ దేశాయ్ ఇంట్లో పిల్లులుతో పాటు డాగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిని తన అభిమానులకు పరిచయం చేస్తుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్...