Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ, రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పైన ఫేస్ బుక్ లో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా వున్నప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి వుంటే బాగుండునని చెప్పింది. దీనిపై పవన్ ఫ్యా

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (21:34 IST)
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పైన ఫేస్ బుక్ లో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇటీవల రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా వున్నప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఓ వ్యక్తి వుంటే బాగుండునని చెప్పింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఫేస్ బుక్‌లో కామెంట్లు చేస్తున్నారు. 
 
ఓ అభిమాని ఇలా రాశాడు...  ‘మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఐ హేట్ యూ... మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు. రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం పోతుంది. ప‌వ‌న్ కల్యాణ్‌ని మేమంతా అన్నా అని పిలుస్తాం, మిమ్నల్ని వ‌దిన అంటాం. మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధప‌డే అవ‌కాశం ఉంది.’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇంకా ఇలాంటి పోస్టులు గంటగంటకూ పడుతూనే వున్నాయి. 
 
ఇటీవ‌ల రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆమె వ్య‌క్తిగ‌త విష‌యంలో క‌ల‌గజేసుకుని ఇలా కామెంట్లు చేస్తున్నారు. వీటిపై రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఇలా కామెంట్లు చేసేవారు కేవలం తనను గురించి మాత్రమే చేస్తున్నారని తను భావించడంలేదనీ, ఈ కామెంట్లను చూస్తుంటే 'ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?' అనే భావన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మరో పోస్టు చేసింది. మహిళల సమానత్వం అంటూనే కొందరు మగాళ్లు ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏడేళ్లు ఒంటరిగా ఉన్నాననీ, తనకు ఇప్పుడు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండుననిపించడం తప్పా అంటూ ప్రశ్నించింది. జీవితాంతం తను తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments