Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్‌కు హిట్ ఖాయమా? కొత్త సినిమా దర్శకుడు ఎవరంటే?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:34 IST)
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు సక్సెస్ రేట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. కానీ ఓ సమస్య మాత్రం అతన్ని వెంటాడుతోంది. తన రెండవ కుమారుడు అల్లు అర్జున్ స్టార్‌గా దూసుకెళుతున్నప్పటికీ, చిన్న కుమారుడు శిరీష్ కెరీర్‌ని మాత్రం విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు.

అతని కెరీర్‌ని నిలబెట్టడం అరవింద్‌కి కష్టంగా మారింది. ఇప్పటివరకూ అరడజను సినిమాలు చేసినా శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. 'శ్రీరస్తు శుభమస్తు' మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త డీసెంట్ సక్సెస్ నమోదు చేసిన చిత్రం. 
 
మిగతా సినిమాల గురించి మాట్లాడినా ప్రయోజనం లేదు. కాబట్టి శిరీష్‌తో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేయకుండా సేఫ్‌గా ఏదైనా రీమేక్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈమధ్యే 'రాక్షసుడు'తో హిట్ సాధించిన దర్శకుడు రమేష్ వర్మకు అల్లు అరవింద్ ఓ ఆఫర్ ఇచ్చారట. శిరీష్‌కు తగినట్లుగా ఉండే ఏదైనా రీమేక్ ఉంటే చూడమని చెప్పారట. 
 
ఏదైనా సేఫ్ రీమేక్ ఉంటే ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధం అని అరవింద్ గారు హామీ ఇచ్చారట. ఒక్క రమేష్ వర్మకే కాకుండా చిన్న సినిమాలతో హిట్స్ సాధిస్తున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ను శిరీష్‌తో ఒక సినిమా చేయమని కోరడం జరిగిందట.  మరి రమేష్ వర్మ, బెక్కం వేణుగోపాల్, శిరీష్ కాంబోలో ఓ సినిమా సెట్ చేస్తారా లేక ఇద్దరితో విడిగా శిరీష్ కోసం రెండు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments