Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొబ్బరి మట్ట సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే? (video)

కొబ్బరి మట్ట సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే? (video)
, శనివారం, 10 ఆగస్టు 2019 (16:31 IST)
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు 
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: స్టీవెన్ శంకర్ 
నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్)
సంగీతం: సయ్యద్ కమ్రాన్ 
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్ 
 
కొబ్బరిమట్ట సినిమా శనివారం (ఆగస్టు 10వ తేదీ)న విడుదలైంది. ఈ సినిమాపై సంపూ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, సంపూర్ణేష్ కాంబో తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ ఎలా వుందో చూద్దాం.. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ''కొబ్బరిమట్ట'' సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. 
 
కథలోకి వెళితే.. పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) గ్రామ పెద్ద. అన్యాయాన్ని సహించడు. న్యాయం వైపు నిలబడతాడు. ఇతనికి ముగ్గురు భార్యలు, ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు వుంటారు. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన జీవితంలోకి కొడుకు నంటూ అండ్రాయుడు (సంపూ) ప్రవేశించి పెద్దరికాన్ని నిలదీస్తాడు.
 
పెద్ద రాయుడు ఇంట్లోని పనిమనిషి (షకీలా) కొడుకుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేస్తాడు. అయితే పెద్ద రాయుడు, పనిమనిషికి గల సంబంధమేమిటి? ఆమెకు పెద్దరాయుడు ఎలాంటి ద్రోహం చేశాడు? ముగ్గురు భార్యలను ఎందుకు చేసుకొన్నాడు? అతి పెద్ద కుటుంబం బాధ్యతను తను ఎందుకు భుజానికి ఎత్తుకొన్నాడు? ఆండ్రాయిడ్ పెదరాయుడిపై పగ తీర్చుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
webdunia
 
కొబ్బరి మట్ట తెలుగు సినిమాలోని కథలు, సన్నివేశాలపై సెటైర్లు విసిరినట్లుంది. పెద్దరాయుడు జీవితంలోని ప్రేమానురాగాలు, ఆప్యాయతలను ప్రధాన అంశంగా కథ సాగుతుంది. బలమైన సన్నివేశాలు, వాటికి తగినట్టుగా డైలాగ్స్ తోడవ్వడంతో హ్యాస్యం తెర మీద బ్రహ్మండంగా పేలిందని చెప్పవచ్చు. సంపూ కోసం రాసిన డైలాగ్స్ ఆలోచింప జేసే విధంగా కాకుండా హాస్యాన్ని పుట్టించడంతో సినిమా సరదాగా సాగిపోతుంది.

ప్రతీ ఫ్రేములో కామెడీని భారీగా చొప్పించారు. సైటరికల్ సినిమాపై ప్రేక్షకులకు మంచి ఫీల్ కలుగజేస్తుంది. ఆండ్రాయిడ్ ఎంట్రీతో మూడున్నర నిమిషాల ఏకధాటి డైలాగ్స్ కేక పుట్టించింది. ఇక రెండో భాగంలో అండ్రాయుడు పాత్ర, పాపారాయుడు పాత్రలు హైలెట్ కావడంతో సినిమా మరింత రంజుగా సాగుతుంది. పెద్దరాయుడు సినిమాను తీసుకొని రాసిన సెటైరికల్ కామెడీలో ఎంచుకోవడంలోనే దర్శకుడు రొనాల్డ్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
 
ఇక సంపూ యాక్టింగ్ అదరగొట్టాడు. మూడు పాత్రల్లో కూడా బ్రహ్మండంగా చేశాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. ఇవన్నీ పక్కన పడితే డైలాగ్ డెలీవరి అద్భుతం అని చెప్పవచ్చు. తెలుగు సినిమాలపై సైటర్లు సంధిస్తూ గతంలో వచ్చిన హృదయకాలేయంకు కొనసాగింపు ప్రయత్నంగా కొబ్బరి మట్ట చిత్రం రూపొందిందని చెప్పవచ్చు.
webdunia


కేవలం వినోదాన్ని కోరుకొనే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఈ సినిమాకు సంగీతం ప్రాణం పోసింది. 
 
పాజిటివ్ పాయింట్స్
సంపూర్ణేష్ బాబు కథ, 
మాటలు, స్క్రీన్ ప్లే
 
నెగిటివ్ పాయింట్స్
రొటీన్‌, ఫార్ములా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్‌కు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్