సంపూర్ణేష్ ప్రపంచ రికార్డు.. కొబ్బరిమట్ట సింగిల్ టేక్‌లో 3 నిమిషాల 27 సెకన్ల డైలాగ్..(video)

సోమవారం, 29 జులై 2019 (15:48 IST)
హృదయం కాలేయం ఫేమ్, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ న‌టించిన తాజా చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట ఎట్ట‌కేల‌కి విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. 2015లో కొబ్బరిమట్ట అనే సినిమాను సంపూర్ణేష్ మొదలెట్టారు.


కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేకపోయింది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలం సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. 
 
రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. కమ్రాన్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృదయ కాలేయం, సింగం 123 తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ప్రస్తుతం కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు.

ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
 
గతంలో సూపర్‌ స్టెప్పులతో ఆకట్టుకున్న సంపూ.. ఈ ట్రైలర్‌లో గుక్కతిప్పుకోకుండా చాంతాడంత డైలాగ్‌ను గలగలా చెప్పేశాడు. మొత్తం 3 నిమిషాల 27 సెకెన్లున్న ఈ డైలాగ్‌ను సంపూర్ణేష్‌బాబు సింగిల్‌ టేక్‌లో ఓకే చేసి రాకార్డు సృష్టించాడట. 
 
ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదో రికార్డని చెబుతోంది చిత్ర యూనిట్‌. మరి ఈ రికార్డు సంగతి పక్కనబెడితే.. సంపూ డైలాగ్ ప్రపంచ రికార్డుపై సెటైర్లు విసురుతూ నెట్టింట డబ్ స్మాష్‌లు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పూరీ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?