జగన్‌ సీఎం కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు

శనివారం, 27 జులై 2019 (17:30 IST)
హ్యాసనటు పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌ అయిన తర్వాత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన నాగార్జున, మహేష్ బాబులు మాత్రమే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కానీ స్వయంగా ఎవరు వచ్చి జగన్ రెడ్డిని అభినందలేదు. దీనిపై పృథ్వీ మాట్లాడుతూ.. ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయివుంటే.. ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్లంత కట్టకట్టుకొని వచ్చి చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం చేసేవారన్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇండస్ట్రీ పెద్దలు జగన్‌ను అభినందించాలన్న జ్ఞానం కూడా చేయలేదంటూ పృథ్వీ ఫైర్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చల్లచల్లగా కూల్‌ కూల్‌గా లాలీపాప్స్.. లాగించేస్తున్న పులులు