Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమాంతం పెంచేసిన కన్నడ భామ

Advertiesment
అమాంతం పెంచేసిన కన్నడ భామ
, సోమవారం, 15 జులై 2019 (12:01 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ క్షణాన టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో గానీ.. వరుస హిట్లతో తారాపథంలోకి దూసుకెళుతోంది. ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రమూ సూపర్ హిట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడి భలే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన రష్మిక... తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసింది. 
 
గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రష్మిక... ఈ చిత్రం కోసం ఆమె 60 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత మరో కన్నడ చిత్రానికి రూ.64 లక్షలు తీసుకుంది. ఇపుడు మహేష్ బాబు సరసన సరిలేకు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె తన పారితోషికాన్ని ఏకంగా రూ.కోటికి పెంచేశారు.
 
కాగా, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన విడుదలకానుంది. ఇవికాకుండా, ఓ తమిళ చిత్రంతో పాటు.. కన్నడ చిత్రంలో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదితిరావుపై మనసుపడిన మాస్ మహారాజా