Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైరా సూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో చేయ‌నున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?

సైరా సూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో చేయ‌నున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
, శనివారం, 27 జులై 2019 (18:33 IST)
సైరా సూరి అన‌గానే ఎవ‌రా సూరి అనుకుంటున్నారా..? అదేనండి డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
అయితే.. ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. సురేంద‌ర్ రెడ్డి, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, రామ‌చ‌ర‌ణ్‌ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నారు కానీ.. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు హీరోల డేట్స్ రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఖాళీగా లేవు. తాజా క‌బురు ఏంటంటే... సురేంద‌ర్ రెడ్డి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. 
 
ప్ర‌భాస్ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల ప్ర‌భాస్‌ని క‌లిసి స్క్రిప్ట్ గురించి డిష్క‌స్ చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న రొమాంటిక్ డ్రామా షూటింగ్‌లో పాల్గొంటాడు. ప్ర‌భాస్ క‌నుక సురేంద‌ర్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే... ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మ‌రి.. సురేంద‌ర్ రెడ్డి ప్ర‌భాస్‌ని మెప్పిస్తాడా..? అవ‌కాశం అందిపుచ్చుకుంటాడా..? అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహో ఆడియో రిలీజ్ డేట్స్ ఫిక్స్... ఇంత‌కీ తెలుగులో ఎప్పుడు..?