Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడిందా? ఫోటోలోని వ్యక్తి ఎవరు?

Advertiesment
payal rajput
ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది. ఆ ఫోటోను చూసిన వారంతా పాయల్‌ను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. 
 
సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఓ ఫోటో పోస్టు చేశారు. కానీ ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఏదో కోడ్ భాషలా నాలుగు గీతలు జోడించింది. దాంతో ఆ ఫోటోలో వుండే వ్యక్తి.. పాయల్ బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. 
 
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్‌ చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇకపోతే.. ప్రస్తుతం పాయల్ ''వెంకీ మామ'' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హేమకు హిమజ వార్నింగ్... గొడవలొస్తాయ్ జాగ్రత్త: బిగ్ బాస్‌తో చతురు కాదు...