Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హేమకు హిమజ వార్నింగ్... గొడవలొస్తాయ్ జాగ్రత్త: బిగ్ బాస్‌తో చతురు కాదు...

Advertiesment
Big boss 3 Telugu
, మంగళవారం, 23 జులై 2019 (14:53 IST)
బిగ్ బాస్ సీజన్ 3 స్టార్టయి రెండురోజులే అయ్యింది. ఐతే బిగ్ బాస్ హేమకి ఇచ్చిన టాస్కుతో బిగ్ బాస్ ఇంట్లో వున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే హేమకి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ప్రకారం హేమ బిగ్ బాస్ ఇంట్లో వున్న సభ్యులు చేస్తున్న పనులు.. ఎలా వున్నాయో చెప్పాలి. హేమ దృష్టిలో నచ్చినవి, నచ్చనివి అన్నమాట. 
 
ఈ లిస్టును ప్రిపేర్ చేసి హేమ బిగ్ బాస్ ముందు పెడితే హౌసులో వున్న కొందరు ఎలిమినేట్ అయిపోతారు. తనకు ఈ టాస్క్ వద్దు మొర్రో అని హేమ మొత్తుకున్నా బిగ్ బాస్ చెప్పడమే కానీ తిరిగి సమాధానం ఇవ్వడు కదా. చెప్పింది చేయడమే. దీనితో హేమ తనకిచ్చిన పని మొదలుపెట్టింది. 
 
డిటెక్టివ్ మాదిరిగా ఓ కన్నువేసి సభ్యులు చేస్తున్న పనులను గమనిస్తోంది. ఎవరు తను చెప్పిన టాస్కులు చేస్తున్నారు... ఎవరు ఏ పనులు చేయడంలేదు, నచ్చినవారు... నచ్చనివారు లిస్టు రెడీ చేస్తోంది. ఐతే హేమకి హిమజ కాస్త చికాకు తెప్పించేసింది. దాంతో తనకు కాని పనిలో తలదూర్చవద్దంటూ హిమజతో చెప్పింది హేమ. దాంతో నన్ను అనవసరంగా ఏమైనా అంటే గొడవలొస్తాయి జాగ్రత్త అంటూ హిమజ వార్నింగులాంటిది ఇచ్చేసింది. మరి ఈ మాటలను హేమ సీరియస్‌గా తీసుకుంటుందా... హిమజపై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుందా... ఏం జరుగుతుందో చూడాల్సిందే.
 
ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన సభ్యుల్లో హిమజకి హేమకి మధ్య గొడవ జరగడంతో హిమజ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. హిమజ ఎక్కడి నుంచి వచ్చింది... ఏం చదివింది.. ఇండస్ట్రీలోకి ఎలా పరిచయమైంది అనే వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. హిమజ ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తోంది. ఆమె దాదాపుగా ఆరడుగుల ఎత్తు వుంటుంది. 29 ఏళ్ల హిమజ విశాఖపట్టణంలో చదివింది. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో రూ. 5000 ఉద్యోగం చేసింది. 
 
ఐతే ఆమె దృష్టంతా నటనపై పడటంతో తొలుత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమె భార్యామణి అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. ఇక అలాఅలా ఆమె పలు టీవీ సీరియళ్లలో నటిస్తూనే యాంకర్‌గా కూడా చేసింది. కొంచె ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ క్రమంలో ఆమెకి సినిమా అవకాశాలు వచ్చాయి.
 
శివం చిత్రంలో పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇటీవలే విడుదలైన వినయవిధేయ చిత్రంలో చెర్రీకి వొదిన పాత్రలో నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ 3 షోలో సభ్యురాలిగా ఎంపికై అందరి దృష్టిలో పడింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా వుంటుంది. హిమజ బిగ్ బాస్ 3లో ఇప్పటికే హేమతో డిష్యూం డిష్యూం అంటోంది. మరి ఆమె ఏమేరకు తోటి సభ్యులపై నెగ్గుతుందో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టకేలకు హీరోయిన్‌ను పట్టేసిన రాజమౌళి... (video)