కీర్తి సురేష్‌కు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

శనివారం, 10 ఆగస్టు 2019 (14:31 IST)
66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా మహానటి ఎంపికైతే, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 
 
మహానటి సినిమాలో ప్రధాన భూమిక పోషించిన కీర్తి సురేశ్ నటన అవార్డుకు అన్ని విధాల అర్హమైనదేనని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. 
 
రామ్ చరణ్ రంగస్థలం, అ!, చి.ల.సౌ సినిమాలకు సంబంధించి సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారిని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అమ్మో అంత ధైర్యం లేదు.. బిగ్ బాస్‌ షోకు అందుకే వెళ్లలేదు.. అనసూయ