జమ్ము కశ్మీర్ పునర్విభజనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆయన పత్రికా ప్రకటనలో ఇలా తెలిపారు. "జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడం సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయంతో సౌందర్యవంతమైన కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని నమ్ముతున్నాను.
అఖండ భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన హింసలో రెండు ప్రాంతాల నుంచి లక్షల మంది చనిపోయారని చదివినపుడు హృదయం వేదనకు గురయ్యింది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం కొన్ని ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ శాశ్వతంగా శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నాను.
ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను. దేశ సమగ్రత ముఖ్యం" అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.