Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రేమలో పడితే చెప్తాను.. మెగా హీరో లవ్ అఫైర్

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:09 IST)
దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజిగా గడిపిన రెజీనా కెసాండ్రా దాదాపు అన్నిభాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ప్రేమలో పడినట్లు, ఆ తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ కూడా జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
ఈ అఫైర్ గొడవ ఇంకా ఆమెను వెంటాడుతుండగా దానిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది రెజీనా. సాయిధరమ్ తేజ్, రెజీనా కలిసి వరుసగా పలు చిత్రాల్లో నటించారు. ఈ జంటకు ప్రేక్షకులలో మంచి ఆదరణ లభించడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఈ సమయంలో వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు, అంతేకాకుండా పెళ్లిపీటలు ఎక్కేవరకు వెళ్లిన వీరి ప్రేమకథకు బ్రేకప్‌తో తెరపడినట్లు జోరుగా వార్తలు వచ్చాయి.
 
బ్రేకప్ తర్వాత సాయి ధరమ్ తేజ్‌ ఆమెకు చాలా దూరంగా ఉన్నప్పటికీ తాజాగా వీరి గురించి ఏవో రూమర్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రెజీనా..నాకు, నా హీరోలతో లింకు పెడుతూ అవాస్తవ వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు. నా వ్యక్తిగత జీవితం మీడియాలో తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకొన్నాను. నాపై రాసేవాటిలో ఎలాంటి నిజం లేదు. 
 
ప్రస్తుతం నాకు ఎవరితోనూ అఫైర్ లేదు. నాకు కెరీర్‌పై తప్ప ఇంక దేనిపై ధ్యాస లేదు. ఒకవేళ మీరు రాసినట్లు నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే.. ముందుగా ఆ విషయాన్ని నేనే వెల్లడిస్తాను. అనునిత్యం నన్ను ప్రొత్సహించి ముందుకు నడిపిస్తూ మీరు చూపుతున్న ఆదరాభిమానాలకు నేను రుణపడి ఉంటాను అని రెజీనా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments