Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోని చూసే హీరో అవ్వాల‌నుకున్నాను - ఆకాష్ పూరి

ఆకాష్ పూరి - నేహా శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం మెహ‌బూబా. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మెహ‌బూబా చిత్రం ఈ నెల 11న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. దిల్ రాజు ఈ సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. సం

Webdunia
మంగళవారం, 8 మే 2018 (19:32 IST)
ఆకాష్ పూరి - నేహా శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం మెహ‌బూబా. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మెహ‌బూబా చిత్రం ఈ నెల 11న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. దిల్ రాజు ఈ సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆల్రెడీ స‌క్స‌స్ అవ్వ‌డంతో మూవీ కూడా ఖ‌చ్చితంగా స‌క్స‌స్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. 11న ఈ మూవీ రిలీజ్ కానున్న సంద‌ర్భంగా ఆకాష్ పూరి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసుకున్నాడు. 
 
ఇంత‌కీ ఏం చెప్పాడంటే... అస‌లు త‌ను హీరో అవ్వాల‌నుకోవ‌డానికి ర‌వితేజ‌నే కార‌ణం అని చెప్పాడు. అంతేకాకుండా... రవితేజ అంటే  చాలా ఇష్టం. ఊహ తెలిసిన తరువాత నేను చూసినవి రవితేజ సినిమాలేనని చెప్పుకొచ్చాడు.
 
ఆయనతో మా నాన్న చేసిన 'ఇడియట్'.. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలు చూశాను. అప్పట్లో నా దృష్టిలో హీరో అంటే రవితేజనే .. నిజం చెప్పాలంటే ఆయనని చూసిన తరువాతనే నేను హీరోను కావాలనుకున్నాను అని చెప్పాడు. నాన్న.. రవితేజ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. వాళ్లిద్దరి నుంచి  నేర్చుకోవలసింది ఎంతో వుంది అంటూ త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఐతే తన రోల్ మోడల్ మాత్రం రజినీకాంత్ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments