Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పఠనం ఓ థెరపీ - ఐ లవ్‌ రీడింగ్ అంటున్న సౌందర్యరాశి

వెన్నెలకు ప్రాణంపోస్తే... మీగడతో ఓ బొమ్మ గీస్తే... మల్లెల్నో మందారాల్నో కుప్పగాపోస్తే... ఆ సౌందర్యరాశి.... రాశిఖన్నా.. హిందీ సినిమాతో అరంగేట్రం చేసినా తెలుగమ్మాయిలా ప్రేక్షకుల గుండెల్లో ఊహలు గుసగుసలాడ

పఠనం ఓ థెరపీ - ఐ లవ్‌ రీడింగ్ అంటున్న సౌందర్యరాశి
, బుధవారం, 2 మే 2018 (14:17 IST)
వెన్నెలకు ప్రాణంపోస్తే... మీగడతో ఓ బొమ్మ గీస్తే... మల్లెల్నో మందారాల్నో కుప్పగాపోస్తే... ఆ సౌందర్యరాశి.... రాశిఖన్నా.. హిందీ సినిమాతో అరంగేట్రం చేసినా తెలుగమ్మాయిలా ప్రేక్షకుల గుండెల్లో ఊహలు గుసగుసలాడేలా చేసింది. ఆమె ఎవరో కాదు.. రాశి ఖన్నా. నింగి మెరిసినా, పువ్వు విరిసినా సరే ఈమె స్పందిస్తుంది. కవిత రాసేస్తుంది. రాశి గదినిండా పుస్తకాల రాసులే. భావ కవిత్వం నుంచి కాల్పనిక సాహిత్యం దాకా ఆమె చదవని సమకాలీన రచనంటూ లేదు. రెక్కల గుర్రాన్నెక్కి ప్రపంచమంతా చుట్టేయడమంటే ఆమెకు సరదా. అలాంటి రాశిఖన్నా తాజాగా తన మనసులోని ఓ విషయాన్ని వెల్లడించింది.
 
'నాకు చదవడం ఇష్టం. పఠనం ఓ థెరపీ. ఐ లవ్‌ రీడింగ్‌. పుస్తకాల పురుగునని మా ఇంట్లో వాళ్లు విసుక్కుంటూ ఉంటారు. చదువుతూ కూర్చుంటే, పక్క వారినే కాదు... నన్ను నేనే మరిచిపోతా. పుస్తకాలతో ప్రయాణం చేసే కొద్దీ... ఇంతకాలం నేను తెలుసుకుంది ఇంతేనా, నేర్చుకుంది ఇదేనా అన్న ప్రశ్న స్థిమితంగా ఉండనీయదు. పుస్తకాల పిచ్చే నన్ను చదువుల్లో టాపర్‌గా నిలబెట్టింది' అని వ్యాఖ్యానించింది. 
 
అంతేనా, ఆ హాబీ వల్లే ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో ఆనర్స్‌ చేయగలిగినట్టు చెప్పింది. ఓ సబ్జెక్టుగా సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు.. కథల్లోని పాత్రల్ని అన్వయించుకోవాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే పరీక్షల్లో బాగా రాయగలం. ఈ సాధన నాకు నటనలోనూ పనికొస్తోంది. ఏదైనా క్యారెక్టర్‌ గురించి దర్శకుడు చెప్పగానే దాన్ని అర్థం చేసుకోవడమూ, అన్వయించుకోవడమూ చాలా సులభం అవుతోందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఆయనే.. కానీ పర్యవేక్షక దర్శకుడిగా...