Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు హీరోయిన్లకు 70శాతం అవకాశాలివ్వాలి: శ్రీరెడ్డి డిమాండ్

నటి శ్రీరెడ్డి తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై మండిపడింది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం ఆగదని తెలిపింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌లో సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వ

Advertiesment
Sri Reddy
, శనివారం, 5 మే 2018 (10:59 IST)
నటి శ్రీరెడ్డి తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై మండిపడింది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం ఆగదని తెలిపింది.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌లో సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని శ్రీరెడ్డి తెలిపింది. అలాగే తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇవ్వాలని, కాస్టింగ్‌ కౌచ్‌ నిరోధక ప్రత్యేక కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. 
 
మరోవైపు ''పెళ్లాం ఊరెళ్తే'' సినిమా తరువాత తనకు కూడా వ్యాంప్ రోల్స్ వచ్చాయి. కానీ వ్యాంప్ రోల్స్ నుంచి బయటపడటానికి నానా తంటాలు పడ్డాను. అందుకోసం చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్‌గా చేశానని సినీ నటి జ్యోతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 
 
కామెడీ, నెగెటివ్ రోల్స్ కూడా చేశాను. అన్నీరకాల పాత్రల్లో కనిపించాలన్నదే తన లక్ష్యం. ఏ పాత్ర ఇచ్చినా జ్యోతి చాలా బాగా చేస్తుందనుకునేలా తన నటనను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపింది. అందుకే, వ్యాంప్ రోల్స్ దాదాపు పక్కన పెట్టేశాను. అయితే పెద్ద బ్యానర్లో మంచి పేరు వస్తుందనుకుంటేనే ఆ తరహా పాత్రలు చేస్తానని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్ కూచిభోట్ల హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు