Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జన్మలో అబ్బాయిగా పుట్టాలనివుంది : రష్మిక మందన్నా

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (09:59 IST)
వచ్చే జన్మలో తాను ఖచ్చితంగా అబ్బాయిగా పుడతానని ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. శర్వానంద్, రష్మికలు జంటగా నటించిన చిత్రం "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
సీనియర్ నటీనమణులు రాధికా, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందంలోని కొందరు పాల్గొని, సినిమా విశేషాలు పంచుకున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నా మాట్లాడుతూ, "చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి. చిన్నాపెద్దా అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. ఇందులోని సంభాషణలు సినిమాటిక్‌గా కాకుండా మన ఇంట్లో వారితో మాట్లాడినట్టే ఉంటాయి.
 
"పుష్ప" చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఈ సినిమాలోనూ నటించా. ఒక్కో పాత్రకు ఒక్కో విధమైన వస్త్రధారణ ఉండేది. డ్రెస్సింగ్‌ విషయంలో ఓ మహిళగా చాలా కష్టపడ్డా. వచ్చే జన్మలో నేను ఖచ్చితంగా అబ్బాయిల పుడతా (నవ్వులు). నా పెళ్లి విషయానికొస్తే.. మంచి మనసు, నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే చేసుకుంటా. దానికి చాలా సమయం ఉందిఛ" అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments