Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి - సూర్య‌

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (22:40 IST)
suriya speech
సూర్య న‌టించిన‌ యాక్షన్ థ్రిల్లర్ `ఇటి`  (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సూర్య మాట్లాడుతూ, రెండున్న‌రేళ్ళుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను చూడ‌లేక‌పోయాను. నేను ఇక్క‌డ‌కు రావ‌డం హోం టౌన్‌గా భావిస్తాను. సురేష్‌బాబు, బోయ‌పాటి శ్రీ‌ను, గోపీచంద్‌, రానా వీరంద‌రినీ క‌ల‌వ‌డం చాలా హ్యాపీగా వుంది. ఓ సంద‌ర్భంలో రానాతో కొద్దిసేపు గ‌డిపాను. చ‌క్క‌గా నేను ఇచ్చిన సూచ‌న‌లు విన్నాడు. ఇక పాండ‌మిక్ లో  అఖండ‌, పుష్ప‌, భీమ్లానాయ‌క్‌.. సినిమాలు తెలుగు సినిమా స్టామినాను ఇండియ‌న్ సినిమాకు రుచి చూపించాయి. నేను కూడా పాండ‌మిక్‌లోనే ఆకాశం నీ హ‌ద్దురా. జైభీమ్ ద్వారా అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యాను. మంచి సినిమాకు హ‌ద్దులు లేవ‌ని తెలియ‌జేసింది. తెలంగాణ‌, ఆంధ్ర అనేవి నా హోమ్‌గా ఫీల‌వుతాను.
 
నేను అగ‌రం ఫౌండేష‌న్ ప్రారంభించ‌డానికి స్పూర్తి చిరంజీవిగారే. మొద‌ట‌గా బ్ల‌డ్ డొనేష‌న్ కేంప్ నిర్వ‌హించి 5వేల మంది పిల్ల‌ల‌కు సాయం చేస్తూ బాధ్య‌త‌గా భావించాను. మ‌నం ఎందులోనైనా ముందుకు వెళ్ళాలంటే హృద‌యంతో ప‌నులు చేయాలి. ఇక ఇ.టి. సినిమా నాకు స్పెష‌ల్ మూవీ. నేను రామ్ ల‌క్ష్మ‌ణ్‌తో చేసిన ఫైట్స్ బాగా వ‌చ్చాయి. ముఖ్యంగా ఇంట‌ర్‌వెల్ బ్లాక్ అద్భుతంగా వ‌చ్చింది. విన‌య్ చ‌క్క‌టి పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రియ అన్ని ఎమోష‌న్స్‌ను బాగా పండించింది. అలాగే జానీ మాస్ట‌ర్ నా నుంచి బెస్ట్ డాన్స్ రాబ‌ట్టాడు. ద‌ర్శ‌కుడు పాండ్య‌రాజ్ చిత్రాలు బాగుంటాయి. ఇ.టి. సినిమా అంద‌రినీ ట‌చ్ చేసే సినిమా. ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది. మీ అంద‌రూ సంతోషంగా వుండాల‌నుకోవ‌డ‌మే నాకు సంతోషం.. ఈ సినిమాకూడా అలాగే సంతోసంగా ఆద‌రించి ప్రేమ‌ను చూపించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments