సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఇటి` (ఎవరికీ తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం రాత్రి సూర్య ఇటీ (ఎవరికీ తలవంచడు) ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ దస్‌పల్లాలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ, నేను సూర్యగారి`పితామగన్` సినిమా నుంచి అభిమాని అయ్యా. అప్పట్లో నేనెవరో తెలీదు. ఆయనెవరో పెద్దగా నాకూ తెలీదు. ఆ తర్వాత పదేళ్ళనాడు సూర్యగారు నేను చేసిన ఓ సినిమాను ఎడిటింగ్‌లో చూశారు.
ఆ తర్వాత నన్ను కారు ఎక్కించుకుని సిటీ అంతా తిప్పుతూ.. నువ్వు చేసేది నటన కాదంటూ క్లాస్ పీకారు. అలా ఆ క్లాస్ పీకబట్టే నేను మెరుగుదల అయ్యాననుకుంటా. ఆ జర్నీ బళ్ళాలదేవ వరకు వచ్చేలా చేసింది. ఇక మా కట్టప్పతో (సత్యరాజ్)తో ఐదేళ్ళనుంచి సినిమా చేశాం. ఇక పాండ్యరాజ్‌కు శుభాకాంక్షలు. పెద్ద విజయం ఇ.టి. కి దక్కాలని కోరుకుంటున్నానన్నారు.