Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం మారేవరకు నాకెవ్వరూ శుభాకాంక్షలు చెప్పకండి.. రష్మీ గౌతమ్

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (19:59 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ నటి, బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రస్థాయిలో మండిపడింది. తనకు ఎవరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొద్దని కోరారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని రష్మీ ఓ వీడియోని షేర్‌ చేసింది. ఆ వీడియో చూస్తే.. మహిళ దినోత్సవం రోజు మహిళకు ఎంత చక్కగా గౌరవం దక్కిందో, దక్కుతుందో అర్థమైపోతుంది. 
 
వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న, ఓ గొప్ప మనసున్న మహిళను.. ఒక పోకిరి ఎలా దూషించాడో రష్మీ షేర్‌ చేసిన వీడియో చూస్తే.. సభ్య సమాజం తలదించుకోక మానదు. పైగా ఆ పోకిరి తల్లిదండ్రులు కూడా వాడి పక్కనే ఉండటం ఈ వీడియోలో ఉన్న మరో విశేషం. 
 
మా వీధి కుక్కలకు మీరెవరు ఫుడ్‌ పెట్టడానికి అనేలా.. ఫుడ్‌ పెట్టడానికి వచ్చిన మహిళపై గొడవ పెట్టుకున్న ఆ పోకిరి.. ఆ మహిళను 'లం*' అని దూషించడమే కాకుండా.. తన కాలికున్న చెప్పు తీసి విసిరి కొట్టాడు. నిజంగా సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని ఆ పోకిరి అలా చేశాడో తెలియదు కానీ.. మహిళ ఇంకా ఇలాంటి పరిస్థితులనే అనుభవిస్తుందని రష్మీ వంటి మహిళలు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఘటనపై మండిపడుతున్నారు. 
 
యాంకర్‌ రష్మీ ఈ వీడియోని షేర్‌ చేసి.. ఇంకా మగాడు మహిళపై దారుణంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దయచేసి నాకెవ్వరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పకండి.. అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. 
 
దయచేసి క్షమించండి.. ఈ సమాజం మారేవరకు నాకెవ్వరూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపవద్దు. మహిళలను ఇంకా మగాడు బహిరంగంగా దూషిస్తూనే ఉన్నాడు. బూతులు తిడుతున్నాడు. తల్లిదండ్రులు పక్కన ఉండగానే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధేస్తుంది. 
 
అందుకే ఈరోజు స్పెషల్‌గా చూడకండి. నార్మల్‌గానే చూడండి. సెలబ్రేషన్స్‌ చేసుకునేంత గొప్పరోజుగా మాత్రం భావించకండి. మానవత్వం మనుషులంతా సమానమే అని చెబుతుంది. సమస్యకు పరిష్కారంగా నాగరికత అనే ఎంపిక ఎప్పుడూ ఉంటుంది.. అని రష్మీ తన ఇన్‌‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments