''సిండ్రిలా''గా రత్తాలు.. స్నేక్ పీక్‌ వీడియో విడుదల.. పవన్ డైరక్టర్ ఆ పని చేశారు.. (Video)

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (19:26 IST)
Cinderella
ప్రపంచ వ్యాప్తంగా ఏంజెల్ స్టోరీల్లో బాగా పాపులర్ అయిన పదం ''సిండ్రిల్లా''. ఈ పేరుతో కోలీవుడ్‌లో ఓ హారర్ మూవీ రూపుదిద్దుకుంది. రత్తాలుగా అందరికీ తెలిసిన రాయ్ లక్ష్మీ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది.

ఈ చిత్రాన్ని వినో వెంకటేష్ డైరక్ట్ చేశారు. ఈయన ఖుషీ దర్శకుడు ఎస్‌జే సూర్య శిష్యుడు కావడం విశేషం. తాజాగా ఈ సినిమా స్నేక్ పీక్ వీడియోను ఎస్‌జే సూర్య సోమవారం తన ట్విట్టర్ పేజీలో విడుదల చేశారు. 
 
ఈ వీడియోలో దృశ్యం ఒకే ఒక షాట్‌లో షూట్ చేయడం జరిగింది. ఇలా ఒకే షాట్ సీన్‌ను షూట్ చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ..  ఈ సినిమాలో విభిన్నత వుంటుందన్నారు. 
Cinderella


రొటీన్‌లా కాకుండా వెరైటీకి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాయ్ లక్ష్మీ ఒకే షాట్‌ తీయడంలో ఎంతో సహకరించిందని.. ఈ ఒకే షాట్‌లో షూట్ చేసిన వీడియో వెరైటీగా వుంటుందన్నారు.
 
 ఈ షాట్ టేకింగ్‌పై ఎస్‌జే సూర్య కొనియాడారని చెప్పుకొచ్చారు. హారర్ సినిమాల్లో సిండ్రిల్లా ప్రత్యేకమని.. రాయ్ లక్ష్మీకి ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెడుతుందని వెల్లడించారు. గ్లామర్‌ టచ్‌తో హారర్ లుక్‌లో రాయ్ లక్ష్మీ ఇందులో కనిపించబోతున్నట్లు తెలిపారు. 
Cinderella
 
సాక్షి అగర్వాల్ ఇందులో విలన్ రోల్ చేసిందని.. వీళ్లతో పాటు రోబో శంకర్, వినోద్, సింగర్ ఉజ్జయిని, గజరాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకు కాంచన 2కి సంగీతం సమకూర్చిన అశ్వమిశ్రా పనిచేశారని వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. 

Cinderella


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments