Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీ ఖ‌న్నా బాగా క‌నెక్ట్ అయ్యింది

రాశీఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. నితిన్‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (18:27 IST)
రాశీఖ‌న్నా న‌టించిన తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. నితిన్‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఈ సినిమాపై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఇదిలాఉంటే... ఈ సినిమాకి రాశీఖ‌న్నా బాగా క‌నెక్ట్ అయ్యింది.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే...తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు.. తదితర విషయాలను శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుసుకున్నానని రాశీ తెలిపింది. సినిమా చేస్తున్నంతసేపు తానూ ఓ తెలుగు అమ్మాయిలానే ఫీల్‌ అయ్యానని..భవిష్యత్తులో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాశీ నవ్వుతూ చెప్పింది. 
 
ఒకవేళ తెలుగు అబ్బాయిని చేసుకోకపోయినా.. పెళ్లి ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు ఎప్పుడు పెళ్లి జరిగినా ఈ సినిమాను గుర్తు చేసుకోవడం మాత్రం ఖాయం అని రాశీ అంది. రాశీ మాట‌లు వింటుంటే బాగా క‌నెక్ట్ అయ్యిన‌ట్టు అనిపిస్తుంది. మ‌రి..ప్రేక్ష‌కులు ఏరేంజ్ స‌క్స‌స్ అందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments