Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ రివ్యూ... ఎలా వుందంటే...?

నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడు

Advertiesment
Srinivasa Kalyanam Trailer Review
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:06 IST)
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ట్రైలర్ మొత్తం కలర్‌ఫుల్‌గా వుంది. 
 
నిమిషం 54 సెకన్లున్న ఈ ట్రైలర్‌లో... మనవడు నాన్నమ్మను పెళ్లంటే ఏంటి అని అడుగగా.. పెళ్లంటే పేద్ద పండగ అని నటి జయసుధ వాయిస్ వినిపిస్తోంది. ఈ తర్వాత ఫోన్‌లో ఎవరు గర్ల్ ఫ్రెండా అని హీరో నితిన్‌ను అడుగుతుంది హీరోయిన్. కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిలను పొగడాలిగా అంటాడు నితిన్. లవ్‌ ఫీల్ వున్న డైలాగ్స్, తన ప్రేమను ప్రకాశ్ రాజ్ అయిన తండ్రితో చెప్పి ఒప్పించిన రాశీఖన్నా డైలాగ్స్ బాగున్నాయి. 
 
ఆపై పెళ్లంటే పెళ్లిలా జరగాలి.. ఫంక్షన్‌లా కాదు. పెళ్లికి మన అనుకునేవాళ్లందరూ వస్తారు. వాళ్లను చూస్తుంటే డెబ్బై ఏళ్ల జీవితం గుర్తుకువస్తోందని జయసుధ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోందని.. సినీ పండితులు అంటున్నారు. కాగా శ్రీ వేంకటేశ్వరా బ్యానర్‌‍పై రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 
 
అయితే ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా ఓ సున్నితమైన ప్రేమకథను తెరపైకి తెస్తుంది. అలాగే పెళ్లి గొప్పతనాన్ని, బంధుత్వ విలువలను కళ్లకు కట్టే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతోందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌కు వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి. 
 
షేర్లు, లైకులు, కామెంట్లతో శ్రీనివాస కళ్యాణం చిత్ర ట్రైలర్‌కు మంచి ఆదరణ వస్తోందని సినీ యూనిట్ వెల్లడించింది. ఛల్ మోహన రంగ సినిమాతో ఫట్‌ను చవిచూసిన నితిన్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించే శ్రీనివాస కళ్యాణం చిత్రం ద్వారా హిట్ ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

70 ఏళ్ల వృద్ధురాలిగా సమంత.. అనుకుంటే అలా మారిపోతుందట..