Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనేంటో తిరుమల శ్రీవారికి బాగా తెలుసు.. 'చల్ మోహన్ రంగ' నితిన్ (Video)

ఎంత పెద్ద ప్రముఖుడైనా శ్రీవారికి భక్తుడే అన్నది అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారు అంటే ఎంతో అపారమైన భక్తి చాలామందికి. ఏ పని మొదలుపెట్టినా స్వామివారిని దర్శించుకున్న తరువాతనే ప్రారంభిస్తారు. ఆ తరువాత

Advertiesment
Chal Mohan Ranga
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (14:49 IST)
ఎంత పెద్ద ప్రముఖుడైనా శ్రీవారికి భక్తుడే అన్నది అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారు అంటే ఎంతో అపారమైన భక్తి చాలామందికి. ఏ పని మొదలుపెట్టినా స్వామివారిని దర్శించుకున్న తరువాతనే ప్రారంభిస్తారు. ఆ తరువాత తాము అనుకున్న కార్యం నెరవేరితే తిరిగి స్వామివారిని దర్సించుకుని మ్రొక్కులు సమర్పించుకుంటుంటారు. సినీ హీరో నితిన్ కూడా ఈ కోవలోని వ్యక్తే.
 
కలియుగ వైకుంఠుడు వేంకటేశ్వరస్వామి అంటే నితిన్‌కు అపారమైన భక్తి. ఆయన ఏ సినిమాను ప్రారంభించినా, సినిమా పూర్తయి విడుదలకు ముందు రోజు స్వామివారిని దర్శనం చేసుకుని వెళుతుంటారు. గతంలో కూడా ఇలాగే తను నటించిన సినిమాలు హిట్ కావడంతో నితిన్ శ్రీవారికి పరమభక్తుడైపోయాడు. నితిన్ నటించిన చల్ మోహన రంగ సినిమా రేపు మార్చి 5న విడుదల కానుంది. సినిమా విజయవంతం కావాలంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నితిన్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారు సర్వాంతర్యామి.. ఆయనకు అన్నీ తెలుసు. చిన్నతనం నుంచి తను ఎలాగ ఉన్నాను. ఏవిధంగా పెరిగాను. సినిమాల్లో ఎలా రాణిస్తున్నానన్నది ఆయనకు బాగా తెలుసు. నేను నటించిన సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్థించానని మీడియాకు తెలిపారు నితిన్. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుక్కుతో డార్లింగ్ సినిమా.. అబుదాబికి ''సాహో'' ఎందుకు?