Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల మధ్య మొరటు రొమాన్స్‌ తప్పులేదుగా? సందీప్ వంగాపై ఎవరేమన్నారు?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (17:24 IST)
ప్రేమికులపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ప్రేమికులు అన్నాక ముద్దుమురిపెం, కొట్టుకోవడం వంటివి వుంటేనే ఆ బంధం దృఢంగా వుంటుందని ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలోకి కంగనా రనౌత్ సోదరి రంగోలి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రంగోలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. 
 
బాలీవుడ్‌లో విడుదలై సెన్సేషనల్ సృష్టించిన కబీర్ సింగ్ సినిమా.. అర్జున్ రెడ్డి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై బాలీవుడ్ విశ్లేషకులు సందీప్ వంగాను తప్పుబట్టారు. వీటికి కౌంటరిచ్చిన సందప్ వంగా.. ప్రేమికులన్నాక కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ముద్దులు వుంటాయన్నారు. 
 
అయితే మొరటైన శృంగారం ప్రేమికుల మధ్య సామాన్యమేనని సందీప్ వంగా చేసిన కామెంట్లపై.. గాయని చిన్మయి, సినీ హీరోయిన్ సమంత, యాంకర్ అనసూయ కూడా తప్పుబట్టారు. వీరు ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీంతో సోషల్ మీడియా చర్చ మొదలైంది.


ఈ చర్చలో భాగంగా ఓ నెటిజన్ బాలీవుడ్ అగ్ర నటుడు పాత రాజ్ కపూర్ సినిమాలోని ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఈ ఫోటో చూసి బాలీవుడ్ అగ్ర నాయిక కంగనా సోదరి రంగోలి స్పందించింది.
 
ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే రంగోలి.. సందీప్ వంగాపై విమర్శిస్తున్న వారిపై మండిపడింది. రాజ్ కుమార్ వీడియో పాటు సందేశం పోస్టు చేసింది.

రాజ్ కపూర్ సన్నివేశంలో మొరటైన శృంగారం వుందని.. ఈ వీడియోలో రాజ్ కపూర్.. హీరోయిన్‌ను పరిగెత్తించి.. చెయ్యిని మెలేసి.. గుండెకు హత్తుకోవడం.. ప్రేయసి చెంపఛెల్లుమనిపించడం వంటి మొరటు సన్నివేశాలు కనిపిస్తాయి.


ఇలాంటి సన్నివేశాల్లో కనిపించిన రాజ్‌కపూర్‌ను సినీ దిగ్గజంగా పరిగణించే మీరు.. దక్షిణాది దర్శకుడు సందీప్ వంగాను తప్పుబట్టడం ఎంత వరకు సమంజసమని రంగోలీ ప్రశ్నించింది. దీనిని బట్టి చూస్తే సీనియర్ అర్జున్ రెడ్డి రాజ్ కపూరేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments