Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో సుకుమార్ మూవీ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "రంగ‌స్థ‌లం". ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సుకుమార్‌తో సినిమా చేసేందుకు చాలా మంది హీరో

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:30 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "రంగ‌స్థ‌లం". ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సుకుమార్‌తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. సుకుమార్ త‌దుప‌రి చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌కే చేయ‌నున్న‌ట్టు వెల్లడించారు. కానీ, హీరో ఎవ‌రు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఇదిలావుంటే ఇటీవల సుకుమార్ మాట్లాడుతూ, తన దగ్గర రెండు మూడు మంచి కథలు ఉన్నాయనీ, అవి ఎవరికి సెట్ అవుతాయనేది చూడాలన్నారు.
 
అందులో ఒక కథను ఆయన చిరంజీవికి వినిపించాడనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'రంగస్థలం' అది సాధించిన విజయం చూసిన చిరంజీవి, సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిని చూపడం వల్లనే కథ వినిపించాడట. చిరూ ఇలా తీరిక చేసుకుని మరీ కథ వినడం వెనుక చరణ్ ఉన్నాడని కూడా చెప్పుకుంటున్నారు. 
 
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను రవితేజ అయితే బాగుంటుందని భావించి సుకుమార్ సంప్రదించడం.. ఆయన ఓకే అనడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని చెబుతున్నారు. మ‌రి.. ఇది నిజ‌మా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments