మామయ్య చిరు నా భర్తను అలా అంటుంటే ఏం చేయలేకపోయా - చరణ్ సతీమణి ఉపాసన
						
		
						
				
చెర్రీ నటనలో బాగా రాటుదేలారు. ఆయన నటన అద్భుతం. నేను భార్యగా చెప్పడం లేదు. లక్షలాదిమంది అభిమానులు చెబుతున్న మాట. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేసిన నటనను మామయ్య చిరంజీవి మెచ్చుకుంటుంటే చాలా సంతోషపడ్డా. చరణ్ నువ్వు బాగా చేశావు. ఇంతకుముందు సినిమాల కన్నా
			
		          
	  
	
		
										
								
																	చెర్రీ నటనలో బాగా రాటుదేలారు. ఆయన నటన అద్భుతం. నేను భార్యగా చెప్పడం లేదు. లక్షలాదిమంది అభిమానులు చెబుతున్న మాట. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేసిన నటనను మామయ్య చిరంజీవి మెచ్చుకుంటుంటే చాలా సంతోషపడ్డా. చరణ్ నువ్వు బాగా చేశావు. ఇంతకుముందు సినిమాల కన్నా ఈ సినిమాలో నీ నటన నాకు బాగా నచ్చింది అంటూ చిరంజీవి పొగడ్తలు నాకు చాలా సంతోషానిచ్చింది. 
	
	 
	నటనలో ఎంత ప్రతిభ చూపినా, నీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా.. ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండమన్న పాట విన్నావు కదా.. అది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. కష్టపడే తత్వంతో పాటు సహాయం చేసే మంచి గుణం ఎప్పుడూ ఉండాలి అంటూ మామ చెర్రీకి చెప్పారు. ఒక్కసారిగా నా భర్తను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న చిరంజీవి ఆనంద బాష్పాలతో కన్నీరు పెట్టుకున్నారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఆ క్షణం నాకు ఏం చేయాలో తోచలేదు.. నాకు ఏడుపొచ్చేసింది. కొడుకు ఎదుగుతుండటం తండ్రి ఎంతో సంతోషాన్నిస్తుందన్న ఉదాహరణను నేను ప్రత్యక్షంగా చూశాను అని చెబుతోంది ఉపాసన. రంగస్థలం సినిమా విజయవంతం కావడంతో తిరుమల శ్రీవారిని ఉపాసన దర్శించుకున్నారు.