చరణ్ ఒక సంపూర్ణమైన నటుడు... 'రంగస్థలం' ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా...
రంగస్థలం చిత్రం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.... " రంగస్థలం విజయోత్సవ వేడుక మోతలవి. అవి అలాగే మోగాలి. ఇంకా మరెన్నో రికార్డులు బద్ధలు కొట్టాలి. అనేక రికార్డులను బద్ధలు కొట్టి ముందుకు వెళుతున్న సందర్భంలో చిత్ర బృందానికి ధన్యవాద
రంగస్థలం చిత్రం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.... " రంగస్థలం విజయోత్సవ వేడుక మోతలవి. అవి అలాగే మోగాలి. ఇంకా మరెన్నో రికార్డులు బద్ధలు కొట్టాలి. అనేక రికార్డులను బద్ధలు కొట్టి ముందుకు వెళుతున్న సందర్భంలో చిత్ర బృందానికి ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత ప్రజల మధ్యనే చూడాలన్న కోర్కె వచ్చింది. రంగస్థలంలో ఏముందన్న ఉత్సుకత కలిగింది.
ఒక జీవితంలా అనిపించింది. రంగస్థలం చిత్రం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. యువతకు ఏం కావాలో తెలుసుకుని తీస్తాడు సుకుమార్. నాకంత ధైర్యం లేదు. అతని సహజత్వానికి చాలా దగ్గర పాత్ర ఇది. రామ్ చరణ్ ఒక సంపూర్ణమైన నటుడు. కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాను. నాకు చాలా కోరికలు ఉంటాయి. కానీ నేను చేయలేని పాత్రలు వుంటాయి. అలాంటివి రాంచరణ్ చేస్తుంటే ఆనందపడ్డాను.
దక్షిణ భారతం నుంచి ఆస్కార్స్ వెళ్లాల్సిన సినిమా ఇది. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. మన నేల కథ, మన మట్టి కథ, మన పంతాలు, మన పట్టింపులు. ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసి పంపాలి. రాంచరణ్‌లో అతిశయాలు చూళ్లేదు. విజయాలు, అపజయాలను పట్టించుకోడు. నిరాడంబరతే ఉన్నతస్థాయికి తీసుకెళుతుంది" అని అన్నారు.