Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అలియా భట్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (11:24 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. పండింటి బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ దంపతులకు ఆదివారం ఆడబిడ్డ జన్మించింది. ముంబైలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో ఆలియా భట్ ప్రసవించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగానే ఉన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఆస్పత్రిలో చేరిన అలియా భట్‌కు వైద్యులు పరీక్షించి వైద్యం చేశారు. ఆ సమయంలో తన భార్య వెంట హీరో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారు. 
 
కాగా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లు గత కొంతకాలం డేటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ యేడాది ఏప్రిల్ 14వ తేదీన వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలకు గర్భధారణ విషయాన్ని అలియా తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. 
 
మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్‌కు సినీ ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్‌ తెలుగు ప్రేక్షకులను పలుకరించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments