Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపాల‌పై వెల్కమ్ టు తీహార్ కాలేజ్ః పి సునీల్ కుమార్ రెడ్డి

Advertiesment
P Sunil Kumar Reddy, Manoj Nandan and others
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (18:21 IST)
P Sunil Kumar Reddy, Manoj Nandan and others
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు,  యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  "వెల్కమ్ టు తీహార్ కాలేజ్". ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్రతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావడానికి కారణం అవుతుంది ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మన ఎడ్యుకేషన్ సిస్టం ఎంత ఫెయిల్యూర్ లో ఉందో , నేను గతంలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అనుకున్న కథ అనుకున్నట్టుగా తీయగలిగాను. ఈ సినిమా చూసి ఏ ఒక్క స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా తన భవిష్యత్తు తన కుటుంబం తన మనోధైర్యాన్ని నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను అలానే అక్టోబర్ 28న విడుదలయ్యే మా సినిమా విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యం ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చూసి మా సినిమా ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ "వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అనే సినిమా నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా సునీల్ కుమార్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం లోని అంశాలు నాకు కళ్ళకు కట్టినట్టు అర్థం అయ్యాయి. లాక్ డౌన్ ముందు మొదలుపెట్టిన ఈ సినిమాని మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం చాలామంది స్టూడెంట్స్ యొక్క ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని అదే అంశాల్ని సినిమాలో చూపించాము ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం ని అలాగే ప్రైవేటు రంగంలో చేస్తున్న మోసాలు కళ్ళకు కట్టినట్టు చూపించాము అక్టోబర్ 28 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది మా సినిమాని స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రత్యేకంగా చూడాలని అలాగే మా సినిమా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టం లో కొంచమైనా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను" అని తెలిపారు.
 
హీరోయిన్ సోనీ రెడ్డి మాట్లాడుతూ వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా 2019లో మొదలైంది . ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్నాను నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా మొదటి సినిమా ఇదే అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఇంటర్ చదివే టైంలో నేను ఫేస్ చేసినటువంటి అనేక సంఘటనలు ఈ సినిమాలో డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చూపించారు.
 
ఫణి చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా మా సినిమా కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని ఈ సినిమాలో నేను నటించేటప్పుడు చాలా ప్రౌడ్ గా హ్యాపీ గా ఫీల్ అవుతూ చేశాను మా సినిమాను ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా నిర్మాత బాపిరాజు త‌దిత‌రులు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో తిరుప‌తి ల‌డ్డు ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులుః ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎద్దేవా