Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్‌లా ఆలోచిస్తే రోజుకి 100 మంది సూసైడ్ చేసుకోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (13:10 IST)
యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. బాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా.. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్... ఇలా దేశంలో ఉన్న సినీ ప్రముఖులు సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న కొంతమంది సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వలన కొత్తవారికి అవకాశాలు రావడం లేదని.. కావాలనే కొంతమంది సినీ పెద్దలు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు.
 
స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వలన సుశాంత్ ఎదుగదలను చూసి తట్టుకోలేకపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ సుశాంత్‌ని ఎప్పుడూ ప్రొత్సహించలేదు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సుశాంత్ ఆత్మహత్య గురించి స్పందిస్తూ... సుశాంత్ ఆత్మహత్మ చేసుకోవడం గురించి కరణ్ జొహార్‌ను విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో తెలియక ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. సుశాంత్‌తో ఇబ్బంది ఉన్నప్పుడు... అతనితో వర్క్ చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం.
 
డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వెలుపలి వ్యక్తిగా సుశాంత్ ఫీల్ అయి సూసైడ్ చేసుకున్నాడని అనుకున్నట్టైతే... సుశాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి. నీకున్న దానితో నీవు సంతోషంగా లేనప్పుడు... నీకు ఎంత ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేవు అంటూ వర్మ తనదైన స్టైల్లో చెప్పినా... వాస్తవమే చెప్పారు. ఇప్పుడు వర్మ చెప్పిన ఈ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments