Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా గమనిస్తుంటారట. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నా ఆయన పవనిజం అంటే చచ్చేంత ఇష్టమట. అందుకే పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని ఆసాంతం చదివేశాడట. చదివిన తర్వాత షాక్ తిన్నాడట. అసలు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:15 IST)
రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా గమనిస్తుంటారట. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నా ఆయన పవనిజం అంటే చచ్చేంత ఇష్టమట. అందుకే పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని ఆసాంతం చదివేశాడట. చదివిన తర్వాత షాక్ తిన్నాడట. అసలు పవన్ కళ్యాణేనా ఇది రాసిందీ అని. ఆ పుస్తకం తను అనుకున్నట్లు లేదట. అందుకే ఆయన ఫేస్ బుక్ వేదికగా పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 
 
అందులో... హేయ్ పవన్, ఇజం పుస్తకం గురించి చెప్పే ముందు నేను మీ గురించి మాట్లాడాలి. జనసేన పార్టీని ప్రారంభించేటపుడు మీరు మాట్లాడిన తీరు, మీ లక్ష్యాలు అన్నీ చూస్తే నాకు చాలా ఆనందమేసింది. మీ ప్రసంగం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మీరు రాసిన ఇజం పుస్తకం లాంఛ్ అవుతుందని చెప్పినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యా. కానీ పుస్తకం చదివిన తర్వాత దానికి అంత సీన్లేదనిపించింది. దీనికి కారణం మీరు కాదనుకుంటున్నా. 
 
పుస్తకం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజ్‌దేనన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మీ భావాలను అతడు ఓ స్కూలు పిల్లాడిలా అర్థం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకూ మిమ్మల్ని చూస్తుంటే... అది మీ భావాలకు దర్పణంగా కనిపించడంలేదు. ఇప్పటి తరానికి కావాల్సింది 100 శాతం పవనిజం. అంతే. 
 
కానీ ఇజం పుస్తకంలో అది 90 శాతం లేదు. కాబట్టి ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. చివరిగా ఓ మాట... మీ ఇజం పస్తకం నన్ను నిరాశపరిచినప్పటికీ మీ పవనిజం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఐ లైక్ ఇట్ అంటూ ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments