పవన్ కళ్యాణ్‌కు అలా అడుక్కోవడం తెలియదు... అలీ
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆ
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక టీవీ ఛానల్లో అడిగిన ఇంటర్వ్యూలో అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు కష్టమైనా, సుఖమైనా తానొక్కడే అనుభవించాలన్నది ఆయన ఆలోచన. పార్టీ పెట్టానని చెప్పి అందరినీ రమ్మని అడుక్కోవడం ఆయనకు తెలియదు. వచ్చే వారిని పొమ్మనరు. రాని వారిని రమ్మనరు.. ఇదీ ఆయన నైజం. నన్నింత వరకు జనసేనలోకి రమ్మని అడగలేదు. ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానన్నారు అలీ.