Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్

పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కొత్త చిత్రం టైటిల్ ఏంటన్న విషయమై పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. 'గోకుల కృష్ణుడు', 'దేవుడే దిగివచ్చినా', 'ఇంజనీర్ బా

పవన్ కొత్త చిత్రం పేరు 'అజ్ఞాతవాసి' .. జనవరి 10న రిలీజ్
, ఆదివారం, 8 అక్టోబరు 2017 (11:44 IST)
పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కొత్త చిత్రం టైటిల్ ఏంటన్న విషయమై పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. 'గోకుల కృష్ణుడు', 'దేవుడే దిగివచ్చినా', 'ఇంజనీర్ బాబు', 'అజ్ఞాతవాసి' ఇలా పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ 'అజ్ఞాతవాసి' అన్న పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించింది. 
 
దీంతో ఇదే పవన్ కొత్త సినిమా పేరన్న భావనకు వచ్చిన అభిమానులు ఈ పేరుతో పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, 'అజ్ఞాతవాసి' అన్న పేరును ఖరారు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. దీపావళి నాటికి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయాలన్న తలంపులో  దర్శకుడు ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు పేరు స్వీటీ.. అనుష్క అనే పేరు ఎలా పెట్టుకున్నానంటే?: దేవసేన